Skip to main content

Namaste NRI

ఇరాన్‌పై దాడులు ఉధృతం

ఇరాన్‌-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్ర రూపందాల్చుతున్నది. ఇరాన్‌కు ఎవరు సుప్రీం నాయకుడిగా వ్యవహరించినా అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తుండగా మరో వైపు ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు ఉధృతం చేయడంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ నాయకత్వం, భద్రతా బలగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వరుస దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఇరాన్‌ సైనిక ప్రధాన కేంద్రంపై 100 విమానాలు, 250 బాంబులతో దాడులకు పాల్పడి 300 పైగా రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. ఇరాన్‌లో ఇంటర్‌నెట్‌ నెట్‌ సేవలు నిలిచిపోయాయి.

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో వెయ్యి మందికి పైగా ఇరాన్‌ ప్రజలు మృతి చెందారు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో 50 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా యుద్ధానికి ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు.

Social Share Spread Message

Latest News