Namaste NRI

ఈసారి రెట్టింపు వినోదంతో మత్తు వదలరా 2

శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మత్తు వదలరా-2. రితేష్‌ రానా దర్శకుడు. క్లాప్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తు న్నది. ఈ  చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగింది. ఈ సందర్భంగా హీరో శ్రీసింహ కోడూరి మాట్లాడుతూ తొలిభాగం పెద్ద హిట్‌ అయింది. దాంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ కంటే డబుల్‌ ఫన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దాం అన్నారు. ఈ సినిమా విజయంపై టీమ్‌ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని నిర్మాత వై.రవిశంకర్‌ చెప్పారు.

ఈ సినిమాలో తాను ఓ పాట రాయడంతో పాటు పాడానని కథానాయిక ఫరియా అబ్దుల్లా తెలిపింది. తొలిభాగాని కి మించిన మలుపులతో సినిమా ఉత్కంఠను పంచుతుందని నిర్మాత చెర్రీ పేర్కొన్నారు. సునీల్‌, వెన్నెల కిషోర్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నార్ని శ్రీనివాస్‌, రచన-దర్శకత్వం: రితేష్‌ రానా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events