గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఆరోగ్య విభాగంలో వందలాది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది. కొత్త ఉద్యోగుల నియామకాల్లోనూ కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. తొలగించనున్న ఉద్యోగులకు ఒక నెల జీతంతోపాటు వారి సర్వీసులోని ప్రతి ఏడాదికి ఒక వారం జీతాన్ని అందిస్తామని చెప్పింది. 2021 డిసెంబర్‌లో సెర్నర్ కంపెనీ నుంచి 28.3 బిలియన్ డాలర్లకు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను కొనుగోలు చేసిన తర్వాత హెల్త్ యూనిట్‌లో ఉద్యోగాల తొలగింపునకు ఒరాకిల్ ఉపక్రమించడం గమనార్హం.


