Namaste NRI

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ సినిమా షూటింగ్ ప్రారంభం

శివకార్తికేయన్‌ కథానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ మూవీస్‌ సంస్థ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టాం. దర్శకుడు మురుగదాస్‌ తనదైన శైలి యాక్షన్‌ అంశాలతో కథను సిద్ధం చేశారు. హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. శివకార్తికేయన్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. ఆయన ైస్టెలిష్‌లుక్స్‌తో కనిపిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఎలామన్‌, సంగీతం: అనిరుధ్‌, ఎడిటింగ్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events