2021 ఫిబ్రవరిలో జరిగిన మయన్నార్ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టుకాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్ డాలర్ల (రూ.11. లక్షల కోట్లు) పరువునష్టం దావా వేశారు. పోస్టులు, వీడియోల రూపంలో ఇటువంటి నీచమైన, అబద్ధాలతో కూడిన ప్రచారం సంవత్సరాల పాటు కొనసాగేందుకు ఫేస్‌బుక్ అవకాశం కల్పించిందని ఆరోపిస్తూ జరిగిన నష్టానికి 150 బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని కోరుతూ రోహింగ్యాలు కాలిఫోర్నియా కోర్టులో దావా దాఖలు చేశారు.
అయితే ఫిబ్రవరి1న తిరుగుబాటు జరిగిన తరువాత మయన్నార్ సైన్యానికి సంబంధించి సమాచారం పోస్టుకాకుండా నిషేధం విధించడం సహా పలు కట్టడి చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. మూడో వ్యక్తి పోస్టు చేసిన సమాచారంపై చర్యలు చేపట్టకుండా అమెరికా అంతర్లాం చట్టం ప్రకారం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది. పిటిషన్‌దారులకు కోర్టులో విజయం దక్కక పోవచ్చని పలువురు నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.