Namaste NRI

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా 14 డేస్ లవ్ విడుదల

మనోజ్‌, చాందిని జంటగా నటించిన చిత్రం 14డేస్‌ లవ్‌. నాగరాజు బోడెం దర్శకత్వం.  హరి బాబు దాసరి నిర్మాత. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ విలువలను కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఓ ప్రేమజంట కథకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ఆసక్తి కరమైన అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఫ్యామిలీ, సెంటిమెంట్‌, వినోదంతో ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం పేర్కొంది.  ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్‌ మునుస్వామి, సంగీతం: కిరణ్‌ వెన్న, మాటలు: గౌరీశ్వర్‌, శివప్రసాద్‌ సామల, దర్శకత్వం: నాగరాజు బోడెం.

Social Share Spread Message

Latest News