ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది సైనికులు చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేసింది. రష్యా వైపున లక్ష మంది, ఉక్రెయిన్ వైపున లక్ష మంది సైనికులు మృతిచెంది ఉంటారని లేదా గాయపడి ఉంటారని అమెరికా సంయుక్త దళాల చీఫ్ జనరల్ మార్క్ మిల్లే ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్ వార్‌లో సుమారు 40 వేల మంది పౌరులు కూడా మృతిచెంది ఉంటారని ఆయన అంచనా వేశారు. అయితే ఇంత భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు పశ్చిమ దేశాలు అంచనా వేయడం ఇదే తొలిసారి. భారీ ప్రాణ నష్టం నేపథ్యంలో రష్యాతో చర్చలు నిర్వహించేందుకు కీవ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్న కారణంగా.. రాబోయేది శీతాకాలం కావడంతో.. రెండు దేశాలు చర్చలపై ఆసక్తి చూపనున్నట్లు వెల్లడించారు. శీతాకాలంలో అక్కడ చలి తీవ్రంగా ఉంటుందని, మంచు ఏర్పడుతుందని, దీంతో యుద్ధం చేయడం కష్టంగా మారుతుందని ఆయన అన్నారు.