Namaste NRI

గూగుల్‌తో  20 ఏళ్ల బంధం…సుందర్‌ పిచాయ్‌ ఎమోషనల్‌

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌  ఆ సంస్థలో చేరి 20 ఏళ్లు అయినట్లు తెలిపారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్‌ మేనేజర్‌గా గూగుల్‌లో తన తొలి రోజు ప్రారంభమయ్యిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంస్థలో చాలా మార్పులు జరిగాయన్నారు. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించే ప్రజల సంఖ్య సహా అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. తన జట్టులో కూడా మార్పులు వచ్చాయని సరదాగా వ్యాఖ్యానించా రు. ఈ గొప్ప సంస్థలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం తగ్గలేదన్నారు.

270424

20 ఏళ్లలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుందర్‌ పిచాయ్‌, 2004లో గూగుల్‌లోకి అడుగుపెట్టారు. ఓ సాధారణ ఉద్యోగిగా గూగుల్‌లోకి అడుగుపెట్టిన ఆయన సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. అంచె లంచలుగా ఎదుగుతూ,  సీఈవో పదవికి చేపట్టారు. గూగుల్‌ క్రోమ్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్‌ డ్రైవ్‌ వంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచి పుట్టకొచ్చినవే. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events