Namaste NRI

బ్రిటిష్‌ కుబేరుల జాబితాలో భారత సంతతి… సునాక్‌ దంపతులకు చోటు

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. రెండేళ్ల క్రితం సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఈ ఏడాది  విడుదలైన తమ ర్యాంకు ను మరింత మెరుగు పరుచుకుని అత్యంత సంపన్నులైన బ్రిటన్‌ ప్రధానమంత్రి దంపతులుగా అవతరించా రు. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అక్షతా మూర్తికి ఉన్న షేర్లే ఇందుకు కారణం. సండే టైమ్స్‌  సంపన్నుల జాబితాలో గతేడాది 275గా స్థానంలో ఉన్న ఈ జంట, ఏడాది సుమారు రూ.6,873 కోట్ల (651 మిలియన్‌ పౌండ్లు) సంపదతో ర్యాంకును మెరుగు పరచుకుని 245వ స్థానానికి చేరింది.

2022`23లో రిషి సునాక్‌ సుమారు రూ.23 కోట్లు ( 2.2 మిలియన్‌ పౌండ్లు) సంపాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెండెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు ( 13 మిలియన్‌ పౌండ్లు) అందుకుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్లే కావడం విశేషం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]