Skip to main content

Namaste NRI

మరో కొత్త వీసాను అందుబాటులోకి తీసుకొచ్చిన యూఏఈ

పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘ కాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో  ఈ బ్లూ రెసిడెన్సీ వీసా ల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడిరచారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం అనేది పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

పదేళ్ల పాటు యూఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బ్లూ వీసాలను ఇవ్వనున్నారు. పర్యావర ణాన్ని పరిరక్షించే విధంగా పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. మైరెన్‌ లైఫ్‌, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, సుస్థిర సాంకేతికత తదితర రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ వీసాలకు అర్హులు. వీటి కోసం ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ, సిటిజన్‌సిప్‌, కస్టమ్స్‌ అండ్‌ పోర్ట్‌ సెక్యూరిటీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాలు పొందే వ్యక్తులకు యూఏఈలో దీర్ఘకాలిక నివాసంతో పాటు పర్యావరణ ప్రాజెక్టుల్లో సహకారం అందించే అవకాశాలు లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేపట్టే చర్యలకు నిధులు, వనరులను కూడా ప్రభుత్వం నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News