భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న ఆమెను అతను చితకబాదాడు. అయితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ మహిళ మృతిచెందింది. ఆ కేసులో ఎం కృష్ణణ్ అనే వ్యక్తికి జైలుశిక్ష పడింది. కృష్ణణ్ చేసిన దాడి వల్ల మల్లికా బేగం మరణించినట్లు తేలింది. ఈ ఘటన జనవరి 17, 2019లో జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ మృతిలో తన తప్పు ఏమీ లేదని ఆ వ్యక్తి హైకోర్టు ముందు వేడుకు న్నాడు. కృష్ణణ్ కేసులో జస్టిస్ వలేరి థీయన్ తీర్పును వెలువరించారు. పదేపదే అతను భార్యను, గర్ల్ ఫ్రెండ్ ను వేధించినట్లు ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. డొమెస్టిక్ వాయిలెన్స్‌కు పాల్పడిన కృష్ణణ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ వలేరి థీన్ తెలిపారు.