
అమెరికాలో చట్టవిరుద్ధంగా కమర్షియల్ డ్రైవర్స్ లైసెన్సులు గల 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది భారతీయులు. వీరి వద్ద కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు గురైన సెమీట్రక్కుల డ్రైవర్లు చట్టవిరుద్ధ వలసదారులు కావడంతో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో నవంబర్ 23-డిసెంబర్ 12 మధ్య కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.















