Namaste NRI

ఈ నెల 24న థియేటర్లలో 7 డేస్‌ 6 నైట్స్‌

సుమంత్‌ అశ్విన్‌, రోహన్‌ హీరోలుగా, కృతికా శెట్టి, మెహర్‌ చాహల్‌ హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన సినిమా 7 డేస్‌ 6 నైట్స్‌. ఈ సందర్భంగా మోహర్‌ చాహల్‌ మీడియాతో మాట్లాడుతూ నిర్మాత ఎం.ఎస్‌.రాజు గారు ముంబయిలో ఓసారి నన్ను చూశారట. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్స్‌ లో పాల్గొమని అడిగారు. ఆయన అనుకున్న కథకు నేను బాగా సరిపోతానని భావించి ఎంపిక చేశారు. ఇదొక యూత్‌ఫుల్‌ మూవీ, ఇందులో నేను రతికా అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. గోవాలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటా. సుమంత్‌ అశ్విన్‌ జోడీగా నటించాను. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకునే చిత్రమిది. ఈ సినిమాలో బోల్డ్‌ సన్నివేశాలేవి ఉండవు. గోనా నేపథ్య కథాంశం కాబట్టి సముద్ర తీరంలో స్విమ్‌సూట్‌లో కనిపిస్తా. భవ్యిత్తులో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా అని చెప్పింది. సుమంత్‌ అశ్విన్‌ ఎం.రజనీకాంత్‌ ఎస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.

………………..

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events