Namaste NRI

అమెరికాలో ఓ నర్సుకు.. 700 ఏళ్ల జైలు

ఓ నర్సుకు అమెరికా కోర్టు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 మధ్య కాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియా కు చెందిన నర్సు హీథర్‌ప్రైస్‌డీ (41) వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసింది. ఆ సమయంలో ఆమె ఆస్పత్రికి వచ్చే రోగులకు మోతాదుకు మించిన ఇన్సులిన్‌ను ఇంజక్ట్ చేసేది. అలా ప్రైస్‌డీ 22 మందికి అధిక మొత్తం లో ఇన్స్‌లిన్ ఇచ్చింది. దానివల్ల 17 మంది రోగులు మరణించారు. తాను మూడు హత్యలు19 హత్యా యత్నాలు చేసినట్టుగా నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.  ఇద్దరు రోగులను చంపినందు కు ఆమెపై తొలుత గత ఏడాది మేలో ఆస్పత్రి వర్గాలు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాయి. కేసు విచారణ సమయం లో భాగంగా నర్సు ఇదే విధంగా మరికొందరి మరణానికి కారణమయినట్టు తేలింది.

Ixora 6

గతంలో ఆమెతో కలిసి పనిచేసిన సహోద్యోగులను పోలీస్‌లు విచారించారు. ఆమె రోగులతో దురుసుగా ప్రవర్తించేదని, తరచూ వారిని అవమానించేలా మాట్లాడేదని వారు పేర్కొన్నారు. ఆమె తన తల్లికి చేసే మెసేజ్‌ల్లో కూడా తన చుట్టూ ఉన్నవారు, రోగులు తనకు నచ్చట్లేదని వారికి హాని కలిగించాలని ఉందని తరచుగా చెప్తుండేది. ఆమెకు ఎటువంటి జబ్బు లేదు. మతిస్థిమితం సరిగానే ఉంది. కానీ తన వ్యక్తిత్వం మంచిది కాదు. ఆమె నా తండ్నిని చంపడం నేను స్వయంగా చూశాను  అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.

Mayfair Namastenri Ad 450 X 150 2 May 2024 4
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events