దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి జనని సాంగ్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దేశభక్తిని చాటేవిధంగా రూపొందించిన ఈ పాట. జననీ ప్రియ భారత జననీ అనే పాట ఈ సినిమాకి ఆత్మలాంటిదని రాజమౌలి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారని పేర్కొన్నారు. ఈ పాటను ఒక్కరోజు ముందుగా హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. జనని పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే ఉంటుందని అన్నారు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)