అంతర్జాతీయ విమానాల రాకపోకలకు భారత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వచ్చిన తర్వాత భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించినా కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకొని పరిమిత ఆంక్షలతో ప్రత్యేక విమానాలను నడుపుతూ వచ్చింది. దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త వేరియంట్ కారణంగా ప్రభుత్వం యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించింది. ఇందులో ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న దేశాలకు ఎప్పట్లానే ప్రత్యేక విమాన సర్వీసులు ఉంటాయి.తాజా ప్రకటనతో ఇక భారత్ నుంచి, బయటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)