అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ బి.1.1.529 హడలెత్తిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)