Namaste NRI

సౌత్ ఆఫ్రికాలో దీక్షా దివస్

సౌత్‌ ఆఫ్రికాలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఆదేశాల మేరకు  దీక్ష దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను, పోరాటాలను సౌత్‌ ఆఫ్రికా శాఖ స్మరించుకున్నది.  కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయ శంకర్‌ సర్‌, రామలింగారెడ్డి,  నాయిని నర్సింహా రెడ్డి, విద్యాసాగర్‌,  నోముల నర్సింహయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్‌ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమన్నారు.  తెలంగాణ వచ్చుడో..కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక కీలక ఘట్టమన్నారు.

                ఈ కార్యక్రమానికి సౌత్‌ ఆఫ్రికా శాఖ మీడియా ఇన్‌చార్జి కిరణ్‌ కుమార్‌ బెల్లి సమన్వయకర్తగా వ్యవహరించగా, ఐటీ  సెక్రెటరీ జయ్‌ విష్ణు గుండా, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ చక్రపాణి దర్శనం, వెల్ఫేర్‌ ఇన్‌చార్జి శివారెడ్డి నల్ల, చారిటీ ఇన్‌చార్జి శ్రీధర్‌ రెడ్డి అగ్గన్నగారి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వంశి వూరె, సతెంద్ర, అభిషేక్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events