అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. ప్రమాదంలో సూర్యాపేట జిల్లా వాసి నరేంద్రని చిరు సాయిగా గుర్తించారు.. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో కార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో వేగంగా వచ్చిన టిప్పర్ కార్ ని ఢీకొట్టడంతో చిరు సాయి స్పాట్‌లో మృతి చెందినట్లు సమాచారం. అమెరికాలోని ఒహయో స్టేట్ లో ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ మధ్యలో ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో చిరు సాయి తో ప్రయాణిస్తున్న నల్గొండకు చెందిన మరొకరు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. మరణించిన చిరు సాయి డెడ్ బాడీ ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బీజేపీ నేతలు సాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని భారత్‌కు త్వరగా తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. సాయి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.