కేసీఆర్ దీక్షా దివస్ ను మలేషియాలో ఘనంగా జరుపుకున్నారు. మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొవిడ్ 19 నిబంధనలను అనుగుణంగా పామ్కోర్ట్ కండొమినియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బేబీ తేజస్విని పాటతో ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య ఘట్టం దీక్షా దివస్ ప్రాముఖ్యతను వివరించడంతో ముగించారు. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ అగిశెట్టి, సత్యనారాయణరావ్, నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవీందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.