Namaste NRI

అమెరికాకు వచ్చే ప్రయాణికులు .. జర్నీకి ఒక్కరోజు ముందుగానే

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభణ దృష్ట్యా అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు అగ్రరాజ్యం కఠినతరం చేయనుంది. అమెరికాకు వచ్చే ప్రయాణికులు జర్నీకి ఒక్కరోజు ముందుగానే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడిరచింది. ప్రస్తుతం ఈ గడువు మూడురోజులు (72 గంటలు)గా ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి, తీసుకున్నవారికి కూడా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

                సీడీసీ డైరెక్టర్‌ డా.రోచెల్‌ వాలెన్‌స్కీ మాట్లాడుతూ ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ టెస్టింగ్‌ విధానంలో మార్పులు చేసేందుకు సీడీసీ యత్నిస్తోంది. నూతన నిబంధనలతో వైరస్‌ నిర్ధరణ పరీక్షల సమయం తగ్గనుంది. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సురక్షితం చేయాలన్న దానిపై క్వారంటైన్‌ విధానంపై సీడీసీ సమీక్షిస్తోందని తెలిపారు. విదేశీ ప్రయాణికులు అమెరికా వచ్చాక వారికి స్థానికంగా కరోనా పరీక్షలు నిర్వహించడంపైనా దృష్టి సారిస్తున్నామని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events