Skip to main content

Namaste NRI

తెల్ల కాగితం.. వచ్చేది అప్పుడే

హర్ష్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ తెల్ల కాగితం. నక్షత్ర కథానాయిక. రమేశ్‌ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మాత. అక్టోబర్‌ 2న సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు హర్ష్‌రోషన్‌, నక్షత్ర ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నారు.

కురుస్తున్న వర్షపు చినుకులు, గొడుగులా అడ్డు పెట్టుకున్న అరిటాకు, నాయకానాయికల రొమాంటిక్‌ లుక్స్‌ ఇవన్నీ ఎంతో సహజంగా, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌ సినిమాపై అంచనాలు పెంచిందని, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి రచన: నందు సవిరిగాన, కెమెరా: కేవీ గుహన్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణం: అరుణాచల క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events