Skip to main content

Namaste NRI

300 మంది భార‌తీయులు మిస్సింగ్‌ : శిశిర్ ఖాన‌ల్

గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఊళ్ల‌కు ఊళ్లు కొట్టుకుపోయిన‌ట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖాన‌ల్ తెలిపారు గురువారం నాటి వ‌ర‌ద‌ల్లో 160 మంది మృతిచెందిన‌ట్లు ఆయ‌న క‌న్ఫ‌ర్మ్ చేశారు. ర‌సువా ప్రాంతంలో వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియ‌రాలేద‌న్నారు. వేల సంఖ్య‌లో కుటుంబాలు ఇండ్లు కోల్పోయాయ‌ని, వారంతా గ‌ల్లంతు అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. జ‌ల విల‌యం వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని ఇంకా అంచ‌నా వేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.మాన‌స స‌రోవ‌రం యాత్ర కోసం వ‌చ్చిన భార‌తీయ ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా మృతిచెందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. సుమారు 300 మంది భార‌తీయులు మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

విదేశీ యాత్రికుల‌తో పాటు భార‌తీయులు కూడా వ‌ర‌ద‌లు సంభ‌వించిన మార్గంలోనే మాన‌స స‌రోవ‌ర య‌త్ర‌కు వెళ్తుంటార‌ని, సుమారు 300 మంది మిస్సింగ్ జాబితాలో ఉన్నార‌ని, వారిని కాంటాక్టు అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఖాన‌ల్ తెలిపారు. విదేశీ ప‌ర్యాట‌కుల క్షేమం కోసం అన్ని దేశాల ఎంబ‌సీల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు నేపాల్ ప్ర‌భుత్వం చెప్పింది. నేపాల్‌లో ఇటీవ‌ల సంభ‌వించిన అత్యంత దారుణ విప‌త్తు అని ఆయ‌న పేర్కొన్నారు. భార‌త్ అందించిన సాయం ప‌ట్ల ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. రెస్క్యూ, రిలీఫ్‌పైనే తాము ఫోక‌స్ పెట్టామ‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events