అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సాధించారు. భారతదేశంలో వివిధరంగాల్లో ప్రభావం చూపిన 100మంది సెలబ్రిటీలతో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సినిమా విజయానికి కథే ప్రధానం. ఏ భాషా చిత్రానికైనా అదే సూత్రం వర్తిస్తుంది. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు.ఆర్టిస్టుల స్టార్డమ్, ఇమేజ్ కంటే కథలో కొత్తదనం సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది అని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు.

ఫోర్బ్స్ ఇండియా ప్రతీ ఏటా విడుదల చేసే ఈ జాబితాలో ఈసారి అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, మోహన్‌లాల్, రజనీకాంత్, రామ్‌చరణ్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, ఏఆర్ రెహమాన్, దుల్కర్ సల్మాన్, రణ్‌వీర్‌సింగ్, రిషబ్‌శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనారనౌత్ తదితరులు ఉన్నారు.















