Skip to main content

Namaste NRI

ఈ సినిమా చూస్తే ఆ ప్రేమకథ మళ్లీ గుర్తొస్తుంది : తుకారాం

వర్ధన్‌, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ కాగితం పడవలు. ఎంజీఆర్‌ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్‌, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. సెప్టెంబర్‌ 18న ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుకారాం మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే ఆ ప్రేమకథ మళ్లీ గుర్తొస్తుంది అన్నారు.

సినిమాలో భాగం కావడం పట్ల హీరో హీరోయిన్లు వర్ధన్‌, కృష్ణప్రియ ఆనందం వెలిబుచ్చారు. సెప్టెంబర్‌ 18న సినిమాను విడుదల చేస్తున్నామని, తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని నిర్మాత అంజనప్ప నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా డీవోపీ రుద్రసాయి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఐఎస్ నౌఫల్‌ రాజా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events