Skip to main content

Namaste NRI

హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్ … ఉద్యోగం పోతే ఇక అంతేనా?

హెచ్‌-1బీ కార్మికులపై డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత హెచ్‌-1బీ కార్మికులకు లభించే 60 రోజుల గడువును తొలగించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కీలక నియంత్రణ సమీక్షలో వైట్‌హౌస్‌ ఆమోదించింది. దీంతో ఈ విధానం అమలుకు మరింత చేరువైంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదనకు ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ అఫయిర్స్‌ (ఓఐఆర్‌ఏ) ఆమోదం తెలిపింది. దీనిని అమలు చేసేందుకు త్వరలోనే బహిరంగంగా ప్రకటన విడుదల కావచ్చునని తెలిపింది.

2017లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం హెచ్‌-1బీ ప్రత్యేక వృత్తి కార్మికులు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే వారు 60 రోజులపాటు లేదా అధికారిక చెల్లుబాటు కాలంవరకు అమెరికాలో ఉండవచ్చు. ఆ వ్యవధిలో వారు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడమో లేదా అధికారికంగా దేశంలో కొనసాగడానికి ఉన్న ఇతర అవకాశాలను వెతుక్కోవడమో చేసేవారు. అయితే ఈ ప్రతిపాదిత కొత్త నిబంధన ఇప్పుడా 60 రోజుల వెసులుబాటును తొలగిస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events