
ప్రముఖ గాయిని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం టాలీవుడ్ హిరోయిన్ రష్మిక మందన్నకు దక్కింది. ఈ బయోపిక్కు సంబంధించి చాలా రోజుల క్రితమే రష్మిక స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎం.ఎస్. ఎ లెగసీ ఆన్ స్క్రీన్ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ భారీ బయోపిక్ తెరకెక్కుతోందని వెల్లడించారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, ప్రొడ్యూసర్ రాక్‌లైన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.















