Skip to main content

Namaste NRI

దుమారం రేపుతున్న సిడ్నీ స్వీనీ యాడ్

అమెరికా న‌టి సిడ్నీ స్వీనీతో చేసిన ఓ యాడ్ తీవ్ర దుమారం రేపుతున్న‌ది. క్రీడ‌ల్లోని మ‌హిళ‌ల‌ను శృంగార‌భ‌రితంగా చూపిస్తున్న‌ట్లు ఆ యాడ్ ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స్పోర్ట్స్ మార్కెట్ ట్రేడింగ్‌కు చెందిన నోవిగ్ యాప్‌ను న‌టి సిడ్నీ ప్ర‌మోట్ చేసింది. ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆమె దాదాపు న‌గ్నంగా న‌టించింది. అయితే ఫుట్‌బాల్‌తో పాటు ఇత‌ర క్రీడా వ‌స్తువుల‌తో ఆమె త‌న శ‌రీరాన్ని క‌ప్పుకుని ట్రేడింగ్ యాప్‌ను ప్ర‌మోట్ చేసింది. ఇక సోష‌ల్ మీడియాలో అనేక మంది మ‌హిళా అథ్లెట్లు ఆ యాడ్‌ను త‌ప్పుప‌ట్టాడు. మ‌హిళ‌ల‌ను అగౌర‌వ‌ప‌రుస్తున్నార‌ని ఆరోపించారు.

నాలుగు సార్లు ఒలింపిక్ స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన ఏరియార్నే టిట్‌మ‌స్ స్పందిస్తూ ఆ యాడ్‌ను చూస్తున్న‌ప్పుడు ఆవేశం వ‌స్తున్న‌ట్లు ఆమె అన్నారు. స్త్రీ శ‌రీరాల‌ను డ‌బ్బు సంపాద‌న కోసం వాడుతుంటే, మ‌హిళా క్రీడ‌లు ఎలా వృద్ధి చెందుతాయ‌ని ఆమె ప్ర‌శ్నించారు. బ్రిటీష్ స్ర్పింట‌ర్ ఆమే హంట్‌, యూఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామ‌ర్ కూడా ఆ యాడ్‌ను త‌ప్పుప‌ట్టారు. ర‌గ్బీ ప్లేయ‌ర్ సోఫీ ఫెల్లా స్పందిస్తూ సిడ్నీ న‌టించిన యాడ్ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే రీతిలో ఉన్న‌ట్లు పేర్కొన్న‌ది. న‌టి స్వీనీ గ‌తంలో రెండు సార్లు ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యింది. అమెరిక‌న్ ప్రొఫెష‌న్ బాక్స‌ర్ క్రిస్టీ మార్టిన్ బ‌యోపిక్‌పై తీసిన క్రిస్టీలో ఆమె న‌టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events