Skip to main content

Namaste NRI

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ పాట కోరినవారు టీజర్ విడుదల

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన తాజా చిత్రం ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇంత సుదీర్ఘమైన వినూత్న టైటిల్‌తో సినిమా రావడం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని ప్రశంసించారు. తాను గతంలో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన మధుమాసం, హౌస్‌ఫుల్, అందరి బంధువయా వంటి సినిమాలకు స్క్రిప్ట్ విభాగంలో పని చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన ఎప్పుడూ అత్యంత సెన్సిబుల్ మరియు కొత్తదానంతో కూడిన కథలను ఎంచుకుంటారని కొనియాడారు.

ఈ చిత్రంలో హర్ష హీరోగా పరిచయం అవుతుండగా, అమైరా గోస్వామి మరియు సుజనా రెడ్డి హీరోయిన్లుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events