ఆశిష్‌గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్సింగ్, అజర్‌ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం డానీ. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ తెరకెక్కించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. రాకేందు మౌళి పాటలు, సాయి కార్తీక్ సంగీతం గొప్పగా ఉంటాయి. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది అని అన్నారు.

ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రమని, వైల్డ్..రస్టిక్ డ్రామాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. గోవాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపామని, నేటి ట్రెండ్‌కు తగిన లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుందని నిర్మాత రిజ్వాన్ పేర్కొన్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఏకే ఆనంద్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: రిజ్వాన్, దర్శకత్వం: కల్యాణ్‌జీ గోగణ.















