
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన గ్లెన్ఉడ్ జాస్కిన్ జూనియర్(60) ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 2024 ఏప్రిల్-2025 ఏప్రిల్ మధ్యకాలంలో యార్క్ హెవెన్‌లోని రీగల్ సినిమా థియేటర్లో అతడు 1,207 సినిమాలు చూసి ఈ ఘనత సాధించారు. సినిమాలు చూసేందుకు ఒక్కోసారి ఆయన తెల్లవారుజామునే థియేటర్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవారు. ఇంటి బయట ఉండటం నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎల్లప్పుడూ దీన్ని ఒక సవాల్‌గా భావించాను అని జాస్కిన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు తెలిపారు. ఒకే సినిమాను ఎక్కువసార్లు వీక్షించిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకొన్నారు. ఇన్ని సినిమాలు చూసినా ఏ సినిమాను తాను నచ్చలేదని చెప్పలేదన్నారు.















