రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌నివ్వగా, టీ-సిరీస్ భూషణ్ కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం పంచుకున్న కాన్సెప్ట్ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది.

నెమలి పింఛం వెనక రామ్‌చరణ్ ముఖం కనిపించేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ఈ కథలో కృష్ణుడి ఎలిమెంట్ కీలకంగా ఉండబోతున్నదని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతున్నది. యు కెన్ ఇమాజిన్ అనే క్యాప్షన్ కూడా ఆసక్తిని కలిగిస్తున్నది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని, ఇదొక విభిన్నమైన కథాంశమని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్, రచన-దర్శకత్వం: సుకుమార్.















