Skip to main content

Namaste NRI

ప్రతి అమ్మాయికీ కకెక్ట్‌ అయ్యే కథ : అర్చన అయ్యర్‌

రాహుల్‌ విజయ్‌, అర్చన అయ్యర్‌ ప్రధాన పాత్రలు పోషించిన డార్క్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆ. సాయిబాలి దర్శకుడు. కనకరావు తొనంగి, అభిషేక్‌ కె, గ్యారీ బీహెచ్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి, డైరెక్టర్‌ నందినీరెడ్డి, హీరో ఆకాష్‌ పూరి, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టని సినిమా ఇది. మూవీ నచ్చితే ఓ పదిమందికి చెప్పండి.దర్శకుడు సాయిబాలికి ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. మనసుపెట్టి పనిచేసిన సినిమా ఇది అని హీరో రాహుల్‌ విజయ్‌ అన్నారు.

ప్రతి అమ్మాయికీ కకెక్ట్‌ అయ్యే కథ ఇదని, థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్‌ చేసేలా సినిమా ఉంటుందని కథానాయిక అర్చన అయ్యర్‌ చెప్పారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందని, శ్రీచరణ్‌ సంగీతం ఈ చిత్రానికి వెన్నెముకని దర్శకుడు సాయి బాలి తెలిపారు. ఇంకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల, సహ నిర్మాత అభినవ్‌ కునపరెడ్డి కూడా మాట్లాడారు.ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events