Skip to main content

Namaste NRI

న్యూజెర్సీలో భారత్ రైజింగ్: ఇన్ ది మోదీ ఎరా పుస్తకావిష్కరణ

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ సాధించిన ప్రగతిపై బీజేపీ ఏపీ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ దిలీప్ కిలారు రాసిన భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా పుస్తకావిష్కరణ సభ న్యూజెర్సీలో ఘనంగా జరిగింది. న్యాయవాదిగా, సివిల్ ఇంజినీర్‌గా, ఆంత్రప్రెన్యూర్ గా గుర్తింపు పొందిన డా.దిలీప్ కిలారు న్యాయ, పరిపాలన, ప్రజావ్యవహారాల్లో తన విశేష అనుభవాన్ని జోడించి ఈ పుస్తకాన్ని రాశారు. మన్రో టౌన్‌షిప్‌లోని ప్రముఖ ఫోర్స్‌గేట్ కంట్రీక్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వివిధ రంగాల ప్రముఖులు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రముఖ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూఎస్‌ఏ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల ముఖ్య అథితిగా విచ్చేయగా, ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన టెక్నాలజీ పారిశ్రామికవేత్త, టెక్నో కాంప్ ప్రెసిడెంట్ సంజయ్ గుండాల విశిష్ట అతిథిగా పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం కృష్ణారెడ్డి అనుగుల, సంజయ్ గుండాల సభునుద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. జాతీయ ప్రగతి, నాయకత్వం, సాంస్కృతిక అస్తిత్వం, ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం డా.దిలీప్ కిలారు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, సాంకేతిక పరివర్తన, జాతీయ భద్రత, సామాజిక సంక్షేమం, ప్రపంచవేదికపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం వంటి అంశాల్లో సాధించిన విజయాలను ప్రస్తావించారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ సంకల్పంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, సంస్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ఓటర్ల జాబిత ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రాధాన్యతను వివరించారు. తన పుస్తకంలో పొందుపరిచిన పాలన, ప్రజాస్వామ్య పారదర్శకత, ఎన్నికల సమగ్రత, జాతీయాభివృద్ధి వంటి అంశాలపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూనే సవాళ్లను గుర్తించడం, దేశ నిర్మాణానికి తమ వ్యక్తిగత సహకారంపై ఆలోచించేలా పాఠకుల్ని ప్రేరేపించడమే లక్ష్యంగా రచయిత ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events