Skip to main content

Namaste NRI

సైబర్​ నేరగాళ్లు ఎంత పనిచేశారంటే?.. డిజిటల్‌ హోర్డింగ్‌లపై!

పలు దేశాల్లో డిజిటల్‌ ప్రకటనల హోర్డింగ్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకొని వాటిపై సాధారణ ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం కలకలం రేపింది. గత నెల 29న ఈజిప్ట్‌, మలేషియా, బ్రెజిల్‌, ఇరాక్‌, చైనాలో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ పరిణామం డిజిటల్‌ ప్రకటనల వ్యవస్థల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నది. ఈజిప్ట్‌లోని గిజా నగరంలో రద్దీ రహదారిపై ఏర్పాటుచేసిన భారీ ఎలక్ట్రానిక్‌ హోర్డింగ్‌పై అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన వాహనదారులు కొందరు తమ వాహనాలను ఆపి వాటిని వీడియోలు తీశారు.

ఈజిప్ట్‌ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆ హోర్డింగ్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ప్రకటనల కంటెంట్‌ను అందించే ఓ అంతర్జాతీయ సంస్థ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడి జరిగింది. దాని ప్రభావంతో పలు దేశాల్లోని డిజిటల్‌ తెరలపై అనధికార కంటెంట్‌ ప్రసారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. మలేషియాలోని జోహోర్‌ రాష్ట్రం క్లువాంగ్‌ పాంతంలో పలు ప్రభుత్వ ఎల్‌ఈడీ తెరలపై అసభ్యకర కంటెంట్‌ ప్రసారమైనట్లు స్థానిక మున్సిపల్‌ కౌన్సిల్‌ ధ్రువీకరించింది. బ్రెజిల్‌లోని కాంపో మయోర్‌ ప్రాంతంలోనూ ఓ డిజిటల్‌ ప్రకటనల తెరపైన అశ్లీల దృశ్యాలు కనిపించాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events