Skip to main content

Namaste NRI

కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

అగ్ర హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌ హైదరాబాద్‌లో కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలిశారు. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డీప్‌ ఫేక్‌ టెక్నాలజీలు దుర్వినియోగం అవుతున్న తీరును అమిత్‌షాకు వారు స్వయంగా వివరించారు. దీన్ని అరికట్టేందుకు మరింత పటిష్టమైన చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేయాలని వారిరువురూ కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన అమిత్‌షా లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని సూచించారు.ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను జి.కిషన్‌రెడ్డికి అప్పగించారు.

కేంద్ర హోంమంత్రి స్పందనకు చిరంజీవి, రామ్‌చరణ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించి, కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని వారు ఆశాభావం వెలిబుచ్చారు. కళాకారులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన, మార్ఫింగ్‌ వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్‌ వేదికగా చిరంజీవి ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events