
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిని రెండు రోజుల్లోనే తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.అయితే ఇందుకు అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని స్పష్టం చేసింది. గతంలో ఏడు రోజుల గడువుతో ప్రతిపాదించిన ఇరాన్ తాజాగా ఆ సమయాన్ని రెండు రోజులకు తగ్గించింది. ఇరాన్ ప్రధానంగా నాలుగు షరతులను విధించింది.















