భారత కన్సల్టింగ్ సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నట్టు అల్‌జజీరా నివేదిక పేర్కొన్నది. అభ్యర్థులకు మద్దతుగా నకిలీ ఖాతాలను సృష్టించి పోస్టులు, వీడియోలు షేర్ చేసినందుకు వారికి చెల్లింపులు జరిగినట్టు తెలుస్తున్నది. వారు ప్రత్యర్థి నాయకుల ప్రసంగాలను సవరించి, తప్పుగా చిత్రీకరించి, వారిపై అవాస్తవ ఆరోపణలను ప్రచారం చేస్తారు. ప్రచారం చేసే సంస్థలకు, కంటెంట్ క్రియేటర్లకు హవాలా మార్గం ద్వారా చెల్లింపులు జరుగుతాయి.

మధ్యంతర ఎన్నికల్లో 62 శాతం మంది భారత అమెరికన్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు భారత అమెరికన్ వైఖరి సర్వే తెలిపింది. ట్రంప్ పాలనపై వారికి ఉన్న భ్రమలు తొలగిపోయినట్టు ఇది తెలియజేస్తున్నది.















