బాలీవుడ్లో ప్రస్తుతం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌ల వివాహం హాట్ టాపిక్. వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారంటూ రెండు మూడు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. డిసెంబర్ 9 గురువారం వీరు దంపతులు కాబోతున్నారు. వారి పెళ్లికి అతిరథ మహారథలను ఆహ్వానించారు. వారందరికీ కోడ్ నేమ్స్ ఇచ్చినట్టూ ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ అంత ఆసక్తిగా ఎదరు చూస్తున్న వారి పెళ్లిపై ఇప్పుడో మరో గుసగుస వినిపిస్తోంది. వాళ్లిద్దరి వివాహ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఓ పెద్ద ఓటీటీ సంస్థ బంపరాఫర్‌ను ప్రకటించినట్టు బాలీవుడ్ వర్గాల టాక్.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు ఇస్తామంటూ కత్రిన, విక్కీలతో సదరు ఓటీటీ చర్చలు జరిపిందని, ఈ విషయం గురించి తెలిసిన అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పటిదాకా కత్రిన విక్కీల జంట మాత్రం ఆ ఆఫర్‌కు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. వాళ్లు ఒకే అనడమే ఆలస్యం వారి పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని లైవ్ ప్రసారం చేస్తారని అంటున్నారు. లైవ్ ప్రసారంలో భాగంగా పెళ్లి లైవ్ పుటేజీ, పెళ్లికి వచ్చిన అతిథులు, తారలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు, స్టైలిస్టుల చిట్టిపొట్టి ఇంటర్వ్యూల వంటి వాటిని టెలికాస్ట్ చేస్తారని చెబుతున్నారు. కాగా గతంలో అదే ఓటీటీ.. దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ ల వివాహానికీ సేమ్ ఆఫర్ ఇచ్చింది. అయితే, అప్పట్లో ఆ జంట దానికి సున్నితంగా నో చెప్పేసిందట. మరి, ఇప్పుడు కత్రిన` విక్కీ జంట అందుకు ఒప్పుకొంటుందా? అన్నది వేచి చూడాలి.