Skip to main content

Namaste NRI

ఆది సాయి కుమార్ ఈగో రాజా నుంచి.. రౌడీ రాకాసి సాంగ్ రిలీజ్

ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ఈగో రాజా. గురుశరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నది. ఈ చిత్రం నుంచి రౌడీ రాకాసి అనే పాటను విడుదల చేశారు. గిబ్రాన్‌ వైబోధ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు.

శ్రీనివాసన్‌ ఆలపించారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆది పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుందని, రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. సతీష్‌, శరణ్య రామచంద్రన్‌, ఆద్య ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్‌ వైబోధ, నిర్మాత: జి.సురేష్‌, రచన-దర్శకత్వం: గురు శరవణన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events