Skip to main content

Namaste NRI

పాక్ కు షాకిచ్చిన యూఎస్ తొలి ముస్లిం సెనెటర్

అమెరికా రాజకీయాల్లో తాజాగా ఎన్నికైన తొలి ముస్లిం సెనెటర్‌గా గుర్తింపు పొందిన అబ్దుల్ ఎల్-సయద్ తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చర్చకు తెరలేపారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థిక, సైనిక సహాయంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో పాటు ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక నిధులు, సైనిక సహాయం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న దేశాలకు అమెరికా ప్రజల పన్నుల రూపంలో సమకూరుతున్న డబ్బును ఎలా ఖర్చు చేస్తారని ఆయన నిలదీశారు.

అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఇలాంటి దేశాలకు మద్దతుగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. విదేశీ దేశాలకు ఆర్థిక, సైనిక సహాయం అందించే విషయంలో అమెరికా ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమెరికా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల సారాంశం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events