Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్, ఫల్గుణి నాయర్

 ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (37వ స్థానం), సౌందర్య సాధనాల ఇకామర్స్‌ సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్‌ (88వ స్థానం) చోటు దక్కించుకున్నారు. భారత్‌లో తొలి, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌, రాజకీయాల్లోకి రాకముందు అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు. మాజీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన ఫల్గుణి ఉద్యోగాన్ని వదులుకొని 2012లో నైకాను ప్రారంభించారు. ఇటీవల సంస్థ ఐపీఓకు అమిత్‌ స్పందన రావడం, షేరు విలువ భారీగా పెరగడంతో, ఆమె నికర సంపద 710 కోట్ల డాలర్లకు చేరింది. దేశీయంగా అత్యంత సంపన్న మహిళగా అమె అవతరించారు.

                ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అమెరికా రచయిత్రి దాతృత్వంలో పేరొందిన మెకంజీ స్కాట్‌ పొందారు. మాజీ జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేశారు. ఇప్పటివరకు 17 సార్లు జాబితా వెలువరించగా, 15 సార్లు మెర్కల్‌ అగ్రస్థానంలో నిలిచారు. తరువాత స్థానాల్లో కమలా హరీస్‌, క్రిస్టీన్‌ లగార్డే, మ్యారీ బర్రా, మిలిండా గేట్స్‌ నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events