Skip to main content

Namaste NRI

ఎట్టకేలకు ఆ కొండపై వెలగనున్న పవిత్ర దీపం!

తమిళనాడు మధురైలోని ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద శనివారం పవిత్ర దీపోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు కొండపై శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్) కొండను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ అరుదైన ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొండ వద్దకు తరలివస్తున్నారు.

కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే అంశంపై కొన్నేళ్లుగా తీవ్ర వివాదం నడుస్తోంది. గతేడాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ దీపం వెలిగించాలని ఆదేశించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం కార్తిక దీపం సందర్భంగా నవంబర్ 24న దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం మధురై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ సహా పలువురు అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది.

శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, శనివారం దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. కొండపై ఉన్న దర్గాకు 50 మీటర్ల దూరం పాటిస్తూ భక్తులను అనుమతించాలని స్పష్టం చేస్తూనే, ముస్లిం భక్తులు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు పూర్తి వెసులుబాటు కల్పించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు వైద్యనాథన్, పార్థిబన్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ పవిత్ర దీపారాధన కార్యక్రమం జరగనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events