భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాని కి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో అంటే 2025 ఫిబ్రవరిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని) మొదటి దశకు సంబంధించిన ముసాయిదాను ఖరారు చేశాయి. అయితే అమెరికా సుంకాల విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఇరుపక్షాలను మళ్లీ చర్చలకు వచ్చేలా చేశాయి. భారత్‌తో సహా 14 ఆర్థికవ్యవస్థలపై అమెరికా కొత్త సుంకాల ప్రతిపాదన చేసింది.

భారత్ అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులపైనా, అలాగే విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపైనా సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం చేస్తుంది. మధ్యంతర ఒప్పందం విజయవంతమైతే భారతీయ వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని విధిస్తుంది.

ఏదైనా దేశం అంగీకరించిన సుంకాలలో ఏవైనా మార్పులు జరిగితే అవతలి దేశం తన కట్టుబాట్లను సవరించుకోవచ్చని అమెరికా, భారత్ అంగీకరిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ను కొనుగోలు చేయాలని భారత్ ఉద్దేశిస్తున్నది.















