విరాట్ కర్ణ హీరోగా రుస్తుం పేరుతో ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్నది. కనిష్క గంధం దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ని హీరో విరాట్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తున్నది. ైస్టెలిష్ యానిమేషన్, ఆకట్టుకునే విజువల్స్, ఆసక్తిని రేకెత్తించే నేపథ్యం, అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో రుస్తుం ప్రపంచంలోని విభిన్న అంశాలను మేకర్స్ పరిచయం చేశారు.

గ్లింప్స్ చివర్లో విరాట్ పాత్రను రివీల్‌చేశారు. రెగ్యులర్ యాక్షన్ సినిమాకు భిన్నమైన ఇంటెన్స్ డ్రామాగా రుస్తుం ఉండబోతున్నదని, ఆకట్టుకునే యాక్షన్, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఓ కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ చూడబోతున్నారని, పవర్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్, గ్రిప్పింగ్ డ్రామా, లోతైన భావోద్వేగాలు కలబోసిన ఈ కథలో ఓ వ్యక్తి తనతో తానే చేసే పోరాటాన్ని జనం చూడబోతున్నారని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.















