గల్ఫ్ దేశం కువైత్ మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను కూడా ఆర్మీలో చేరే అవకాశం కల్పిస్తూ ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ సబా ప్రకటన చేశారు. ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న మహిళల కోసం డిసెంబర్ 19 నుంచి దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు ప్రకటించారు. మేము మహిళలను సైన్యంలో చేరమని బలవంతం చేయలేదు. సైన్యంలోని పురుష అధికారులతో సమానమైన ప్రయోజనాలను పొందడానికి మాత్రమే మేము వారికి అవకాశం ఇచ్చామని అన్నారు. ఆసక్తి ఉన్నవారు సైన్యంలో చేరి ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా తెలిపారు.