Skip to main content

Namaste NRI

వ్యాంపైర్‌ పాత్రలో అమలాపాల్‌

సినిమాలకు విరామాన్ని ప్రకటించిన కథానాయిక అమలాపాల్‌ కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నది. రెండేళ్ల విరామం తర్వాత ఆమె హాఫ్‌ అనే వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ చిత్రం ఇప్పటికే టొరంటో, ఇఫీతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. హాలీవుడ్‌లో పాపులర్‌ అయిన వ్యాంపైర్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్రతీకార కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అమలాపాల్‌ మనుషుల రక్తం తాగే వ్యాంపైర్‌ పాత్రలో కనిపించనుంది. సమ్జద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అబ్బాస్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజస్థాన్‌ ఏడారిలో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సగం మనుషులు, సగం వ్యాంపైర్లుగా ఉన్న అన్నాచెల్లెళ్ల కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events