Skip to main content

Namaste NRI

భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం?

ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగుల కోతకు సిద్దమైంది. జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ SAP సుమారు 10 వేల ఉద్యోగాలను తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రంగంలో పెట్టుబడులు పెంచుతూ, వ్యాపార కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఉద్యోగాల తొలగింపు అనేది ఒకేసారి కాకుండా వివిధ మార్గాల్లో చేపట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే నేరుగా ఉద్యోగాలను తొలగించడం కంటే కూడా సహజంగా ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేయకపోవడం, స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశాలు కల్పించడం వంటి విధానాల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, ఏ విభాగాల్లో ఉద్యోగాల కోత ఉండనుంది? ఏయే బృందాలు ప్రభావితమవుతాయి? అనే వివరాలను SAP ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events