Skip to main content

Namaste NRI

ఏమాత్రం భయపడకుండా ఆ సీన్స్‌ పూర్తిచేశా: మీనాక్షి చౌదరి

నాగచైతన్యతో మీనాక్షి చౌదరి కలిసి నటించిన తాజా చిత్రం వృషకర్మ. కార్తీక్‌ దండు దర్శకత్వం. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రలపరంగా ప్రయోగాల్ని ఇష్టపడుతున్నా. నా కంఫర్ట్‌జోన్‌ దాటి సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఒకే తరహా పాత్రలు, కథల్ని రిపీట్‌ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అని చెప్పింది. ఈ సినిమాలో తాను ఆర్కియాలజీలో థిసెస్‌ చేసే దక్ష అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, ఇప్పటివరకు వచ్చిన హారర్‌, మిథికల్‌ థ్రిల్లర్స్‌కు పూర్తి భిన్నమైన కథాంశమిదని చెప్పింది. ఈ సినిమాలో విజువల్స్‌, యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఈ సినిమాలో అలాంటి సీన్స్‌ ఉన్నాయి. అవి ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ సీన్స్‌ పూర్తిచేశాను అని తెలిపింది.

హీరో నాగచైతన్య మృదుస్వభావి, సహృదయుడని, ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా అనిపించిందని పేర్కొన్నది. ప్రతి పాత్రను తాను ఓ సవాల్‌గా తీసుకుంటానని, అంకితభావంతో పనిచేస్తానని తెలిపింది. ఈ చిత్రం డిసెంబర్‌ 4న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events