Skip to main content

Namaste NRI

ఆకట్టుకునేలా ఓ టార్చర్ ప్రేమ .. టీజర్ రిలీజ్

శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. దివంగత నటుడు మాదాల రంగారావు మనవడు, నటుడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతుండగా, మౌనిక వీర్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర బృందం టీజర్ లాంఛ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.

అందమైన ప్రేమకథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంలా నిలుస్తుందని దర్శకనిర్మాత శ్రీకర్‌కృష్ణ పేర్కొన్నారు. నేటి యువత మెచ్చే చిత్రమిదని హీరో సన్నీ తెలిపారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధార్థ్ వర్మ, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, నిర్మాణం, దర్శకత్వం శ్రీకర్ కృష్ణ కాగా, సామి సినిమాటోగ్రఫీ, ఇషాక్ అలీ సంగీతం, ప్రతీక్ నూటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events